Home ప్రకాశం పెట్రోల్ ధరలకు నిరసనగా రాస్తారోకో

పెట్రోల్ ధరలకు నిరసనగా రాస్తారోకో

420
0

చీరాల : పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా శనివారం ఈ పురుపాలెం కాలువ వద్ద సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రజ లపై భారాలు వేస్తూ కార్పొరేట్ కంపిణీలకు వరాలు ఇచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాల ను ప్రజలు అర్ధం చేసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఆయిల్ అసలు దరకన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే అధికంగా పెంచా యని ఆరోపించారు. జిఎస్టీని అమలులోకి తీసుకొచ్చి రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తుందన్నారు.

ఆయిల్ ధరలను ఎందుకు జిఎస్ట్ పరిధిలోకి తీసుక రాలేదని ప్రశ్నించారు. అంబానీలకు లాభం చేకూర్చి ప్రజలపై భారాలు వేసేందుకు పెట్రోల్ ధరలు రోజువారీగా సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారని అన్నారు. రూపాయల్లో ధరలు పెంచుతూ పైసల్లో తగ్గించి ప్రజాలకేదో ఒరగబెడుతున్నట్లు చెప్పుకోవడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. రాస్తా రోకోలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఎం వసంతారావు, దేవతోటి నాగేశ్వరరావు, జి ఆదిత్య, పి కాలేష, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, ఎ బాబురావు, సాంయేలు, జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరామప్రసాద్, శేఖర్ పాల్గొన్నారు.