చంద్రయాన్‌పై ఉన్న శ్రద్ద మణిపూర్‌పై ఎందుకు లేదు : సిపిఐ నేత నారాయణ

    132
    0

    చీరాల : జాండ్రపేటలోని తన స్నేహితుడు పన్నెం సుబ్బారావు ధర్మపత్ని శ్రీవల్లి ఈనెల 21న మృతిచెందిన విషయం తెలుసుకున్న సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయ స్వభావం, స్వరూపం మారాల్సిన అవసరం ఉందన్నారు. మణిపూర్ రాష్ట్రం మత కలహాలతో అట్టుడికిపోతుంటే మోదీ అక్కడికి ఎందుకు పోవడంలేదని ప్రశ్నించారు. మోడీ గుజరాత్ సిఎంగా ఉన్న కాలంలో అక్కడా మతకలహాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, శాంతియుత జీవనం పరిస్థితులు కల్పించేందుకు మోడీ ఎందుకు ప్రయత్నం చేయడంలేదని ప్రశ్నించారు. అది మరచి చంద్రయాన్-3గురించి మాట్లాడతున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు మోడీకి సాగిలపడ్డారని ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీల గురించి ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడగడంలేదని అన్నారు. మన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి టెంకాయ కొట్టిన మోడీ ఆ విషయంపై మాట్లాడటం లేదని అన్నారు. తన హావభావాలతో ప్రధాని మోడీ దేశ ప్రజలను మాయచేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదని ప్రజలకు సూచించారు.