బాపట్ల : పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్ వద్ద రోడ్డుపై వెళుతున్న టివిఎస్ స్కూటీని ఆవు ఒక్కసారిగా నెట్టేసింది. దీంతో టివిఎస్ స్కూటీతోపాటు స్కూటీపై ఉన్న భార్య భర్త ఇద్దరూ చిన్న పిల్లలు రోడ్డుపక్కనున్న డ్రైన్‌లో పడిపోయారు. గమనించిన ప్రజలు డ్రైన్లో పడ్డ నలుగురినీ, స్కూటీని బయటకు తీశారు. ప్రమాదంలో నలుగురూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
బాపట్ల మునిసిపల్ అధికారులు గతంలో ఆవుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆవులు యజమానుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆవులను యధావిధిగా రోడ్లపై వదిలేస్తున్నారు. రోడ్లుపై తిరుగుతున్న ఆవులు ప్రజలకు, వాహనదారులకు త్రీవ ఇబ్బంది కలుగుచేస్తున్నాయని, వాటివల్ల వాహనాలపై వెళ్లేవారికి ప్రాణహానీ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంటున్న ఆవులను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.