అమరావతి : రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ లకు చైర్మన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్కే రోజాకు ఏపీఐఐసి ఛైర్మన్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ, సీఆర్డీఏ ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా మోహన్‌బాబు, ఆర్టీసి ఛైర్మన్‌గా అంబటి రాంబాబు పేర్లు ఖరారు చేశారు. కాపు కార్పోరేషన్ ఛైర్మన్‌గా గ్రంధి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని ద్రోణంరాజు శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా యేసురత్నంను నియమించారు.
సివిల్ సప్లయిస్ కమిషన్ ఛైర్మన్‌గా ఆమంచి కృష్ణమోహన్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా మోషేన్ రాజు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా మహ్మద్ ముస్తఫాను ఎంపిక చేశారు. ఇతర ఛైర్మన్ల పోస్టులను జగన్ దాదాపు భర్తీ చేసినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా భూమన కరుణాకర రెడ్డికి రాయలసీమ అభివృద్ది మండలి ఛైర్మన్ గా నియమించ నున్నారు.