Home వైద్యం 2శాతం బెటాడిన్ గార్గ్లే తో కరోనా వైరస్ నియంత్రణ : అడ్డిషనల్ DGP డాక్టర్ రవి...

2శాతం బెటాడిన్ గార్గ్లే తో కరోనా వైరస్ నియంత్రణ : అడ్డిషనల్ DGP డాక్టర్ రవి శంకర్ అయ్యన్నర్

633
0

మెడికల్ :  కరోనా వైరస్ ప్రజలను భయపెడుతున్న పరిస్థితుల్లో కూడా పోలీసు, మెడికల్, పారిశుధ్యకార్మికులు, రెవిన్యూ సిబ్బంది, మీడియా ప్రతినిధులు బయటికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. విధినిర్వహణలో కారొన వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు బెటాడిన్ గార్గ్లే 2శాతం ద్రావణంకు నీటిని కలిపి ముక్కు, నోరు శుభ్రం చేసుకోవాలని శాంతిభద్రతల అదనపు డిజిపి డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు.

ఇది 2% బెటాడిన్ గార్గ్లే కు అంతే పరిమాణంలో నీటిని కలిపి ద్రావణాన్ని పలుచన చేయాలి. అందుకు బాటిల్‌పై కొలిచే కప్పులో 15మి.లీ బెటాడిన్ గార్గ్లే ద్రావణాన్ని తీసుకొని ప్రత్యేక గాజులో పోయాలి. ద్రావణానికి సమానమైన నీటిని జోడించండి. ఆ తర్వాత ఇయర్‌బడ్ యొక్క ఒక వైపును ద్రావణంతో తడిపి ముక్కు రంధ్రం యొక్క ఒక వైపు పూయండి. రెండో ముక్కు రంధ్రంలో కూడా పూయడానికి ఇయర్ బడ్ రెండోవైపు క్లీన్ ఎండ్‌ను ముంచండి. ముక్కును శుభ్రం చేసిన తరువాత దీన్ని డస్ట్‌బిన్‌లో ఇతరులకు తగలకుండా పడేయండి. మిగిలిన ద్రవాన్ని మీ నోటిలో పోసి, ఈ వీడియోలో చూపిన విధంగా 30 సెకండ్స్ పుక్కిలించి నోటిని శుభ్రం చేసుకోండి. పుక్కిలించిన తర్వాత ద్రవాన్ని డ్రైన్ లోకి వెళ్లే విధంగా ఉమ్మివేయండి.

మీరు COVID19 పాజిటివ్ అయితే మీరు దీన్ని రోజుకు నాలుగు సార్లు ఇలా చేయాలి. మీరు హెల్త్‌కేర్ వర్కర్ లేదా మీ డ్యూటీలకు హాజరయ్యే వారైఉంటే… డ్యూటీకి బయలుదేరే ముందు, డ్యూటీ సమయంలో 6 గంటలకు మించి ఉంటే ఇంటికి చేరుకున్న వెంటనే ఒకసారి ఇలాగే చేయండి. మీరు ఇంట్లోనే ఉంటే మీరు అల్పాహారం తర్వాత రెండుసార్లు, నిద్రపోయే ముందు మరొకసారి ఈ ద్రావనముతో ఇలా చేయవచ్చు.

బెటాడిన్ గార్గ్లేను పుక్లించడం వలన కారొన వైరుస్ ఉన్నవారికి వైరస్ పెరగకుండా ఉంటుంది. వారినుండి ఇతరులకు సోకకుండా వుండే అవకాశం వుంటుంది. లాక్ డౌన్ లో డ్యూటీ చేస్తున్న వారు, ఇంటిలో ఉన్నవారు ఈ విధంగా చేయడం వల్ల కారొన వైరస్ బారిన పడే అవకాశం తక్కువగా వుంటుంది.

మాస్క్ ధరించడంతోపాటు చేతులుశుభ్రం చేసుకోవడం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూనే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. సి విటమిన్ ఎక్కువగా దొరికే నిమ్మ, ఉసిరి, చింతపండు, మునగ కాయలు, జామ, కమలా పండులను తినాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తు ఆరోగ్యంగా విధులకు హాజరు కావాలని సిబ్బందికి సూచిస్తున్నాను. అందరు ఆరోగ్యంగా ఉండాలని శాంతి భద్రతల అదనపు డిజిపి డాక్టర్ రవి శంకర్ ఆయ్యన్నర్ కోరారు.