చీరాల : కరోనా పాజిటివ్ వస్తే ఒంగోలు, గుంటూరు వెళ్లవలసిన అవసరం లేకుండా కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డ్ ద్వారా శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ నందు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు తెలిపారు.
కరోనాకు చికిత్స ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా కూడా అందించేందుకు తమకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉచితంగా చికిత్స చేస్తామన్నారు. నోడల్ ఆఫీసర్ గా ఉదయ్ కుమార్ ని నియమించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కారొన సంబంధించి హెల్ప్ డెస్క్, ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. హాస్పిటల్ లో కారొన వ్యాప్తి నియంత్రణకు అవసరమైన పూర్తి జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.