Home ఆధ్యాత్మికం అర్చకులకు కరోనా వైద్య పరీక్షలు

అర్చకులకు కరోనా వైద్య పరీక్షలు

286
0

చీరాల : దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశం మేరకు చీరాల గవర్నమెంట్ హాస్పటల్ వైద్యాధికారులు డాక్టర్ కమలశ్రీ, డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో చీరాల ప్రాంతంలోని వివిధ ఆలయాల అర్చక స్వాములు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. 70మందికి పేరాల శివాలయం నందు ఈఒ టీవీ శివనాగదాసు ఆధ్వర్యంలో అర్చకులు, సిబ్బంది స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దేవాలయంలో అందరూ సామాజిక దూరం పాటిస్తూ భక్తులను కూడా కరోనా గురించి జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో అర్చక సంఘ నాయకులు కారంచేటి నగేష్ కుమార్, దిట్టకవి వాసుదేవ్ ఆచార్యులు పాల్గొన్నారు.