Home ప్రకాశం కరోనా బాధితుల సహాయానికి వైసిపి కమిటీల ఎన్నిక

కరోనా బాధితుల సహాయానికి వైసిపి కమిటీల ఎన్నిక

280
0

– కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకుంటాం.
– విలేకరుల సమావేశంలో చీరాల వైసిపి యువనేత కరణం వెంకటేష్ బాబు
చీరాల : రామకృష్ణాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది పనులు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ప్రజలకి కరోనా వైరస్ పై అవగాహన కల్పించి, వారికి నిత్యవసర వస్తువులు, ఆహారాన్ని అందించే ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. ఈ పనులు నిర్వహించేందుకు చీరాల నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షునిగా కరణం వెంకటేష్ బాబును ఎన్నుకున్నారు. చీరాల నియోజకవర్గ కమిటీ కన్వీనర్ గా డాక్టర్ వరికూటి అమృతపాణి, సభ్యులుగా జంజం శ్రీనివాసరావు, చల్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు.

చీరాల పట్టణ కమిటీ కన్వీనర్ గా బొనిగల జైసన్ బాబు, సభ్యులుగా తేలప్రోలు వెంకటేశ్వరరావు, తిరువీధుల శ్రీనివాసరావు, మించాల సాంబశివరావు, షేక్ రియాజ్, మల్లి రామకృష్ణ, కావూరి ఆగస్టీన్, అనపర్తి రత్నబాబు ఎంపికయ్యారు.

చీరాల మండల కమిటీ కన్వీనర్ గా దామర్ల శ్రీకృష్ణమూర్తి, సభ్యులుగా బండ్ల సురేంద్రబాబు, గవిని వాసురావు, పేరిచర్ల స్వామిదాస్, షేక్ బాషా, బోయిన కేశవులు, కావూరి రమణారెడ్డి, ఆసాది అంకాలరెడ్డిని ఎన్నుకున్నారు.

వేటపాలెం మండల కమిటీ మండల కన్వీనర్ గా రొండా పట్టాభిరామిరెడ్డి, సభ్యులుగా షకీల్, హనుమంతరావు, పులి వెంకటేశ్వర్లు, గిడుగు మస్తాన్ రావు, కట్ట గంగయ్య, కటకం శ్రీనివాసరావును ఎంపిక చేశారు.

చీరాల నియోజకవర్గ కోఆర్డినేటర్ కమిటీ కన్వీనర్ దేవరపల్లి బాబురావు, మల్లెల బుల్లిబాబు, నీలం శామ్యూల్ మోజెస్, చుండూరి వాసు, డేటా జోసఫ్ తదితరులు ఉన్నారు.