– అతి తక్కువ ధర కే కరోనా రక్షక్ కిట్.
– మందులు, పిపి కిట్స్ మొత్తం 20రకాలు ఐటమ్స్
– హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగకరం
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, రోటరీ క్లబ్ ఆఫ్ క్షిరపురి అద్వర్యంలో రూ.5వేల విలువైన కారొన రక్షక కిట్ కేవలం రూ.3వేలకే కారోన పాజిటివ్ బాధితులకు పంపిణీ చేస్తున్నారు.
ప్రస్తుతం కరోనా విజృంభిస్తుంది. ఈ పరిస్థితిలో వైద్యశాలలో రోగులకు మంచాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటువంటి వారికి ప్రత్యేకంగా మెడికల్ కిట్ ఎంతో అవసరం. దీని ద్వారా బాధితులు ఎప్పటికప్పుడు స్వయంగా పరీక్షలు చేసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో వైద్యశాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది. అయితే వైరస్ బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు కొందరు మెడికల్ కిట్ల ధరను అమాంతం పెంచారు. దీంతో పేద, మధ్య తరగతి బాధితులకు ఇది ఎంతో భారంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంటి వద్ద ఉండి చికిత్స పొందే కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే విధంగ కారొన పాజిటివ్ వచ్చి మైల్డ్ సింటమ్స్ ఉన్నవారికి కారొన రక్షక్ కిట్ ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి అధ్యక్షుడు తాడివాలస దేవరాజు మాట్లాడుతూ ప్రస్తుతం చీరాల పరిసర ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుంది అన్నారు. ఈ పరిస్థితిలో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఒకవైపు పనులు లేక అవస్థలు, దీనికి తోడు కరోనాతో పెరుగుతున్న ఖర్చులు తట్టుకోలేక ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సెక్రటరీ న్నపనేని రామకృష్ణ మాట్లాడుతూ ఈ పరిస్థితి లో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు తమ క్లబ్ అద్వర్యంలో ఇంటి వద్ద ఉండి చికిత్స పొందేవారికి అతి తక్కువ ధరకు మెడికల్ కీట్లు అందచేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఎటువంటి వైద్య సలహాలు కావాలన్న ఏ సమయంలో అయిన శ్రీ కామాక్షి కేర్ వైద్యశాలను ఫోన్ లో సంప్రదించి సహాయం పొందవచ్చని చెప్పారు. కరోనా బాధితులు ఈ అవకాశన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ విజయ్ కుమార్, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్డగడ మల్లికార్జునరావు, రావి వెంకటరమణ పాల్గొన్నారు.