చీరాల : కరోనా వైరస్ నుండి వైద్య సిబ్బందిని కాపాడు కోవడానికి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది తయారు చేసినటువంటి ఫుల్ ఫేస్ మాస్క్ లను ఐఎంఎ ప్రెసిడెంట్ డాక్టర్ భవానీ ప్రసాద్ కు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు అందించారు.
ఈ సందర్బంగా డాక్టర్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ కరోనా మానవాళికి తీరని కష్టాలను తెచ్చి పెట్టిందన్నారు. అందరం ధైర్యంతో దీనిపై పోరాడి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు కృషి చేయాలని కోరారు. ప్రజలు మాస్కులు వేసుకోకుండా రోడ్డుపైకి రాకూడదన్నారు. ఈ ఫుల్ మాస్కులు వైద్య సిబ్బందికి, ప్రజలకు దగ్గరగా ఉండి విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, కారొన వైరస్ వ్యాప్తి నియంత్రణకు పనికి వస్తుందని తెలిపారు. ఫుల్ ఫేస్ మాస్కులు అందించిన తాడివలస దేవరాజును అభినందించారు.