చీరాల : కరోనా నుంచి రక్షణ కోసం శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ తాడివలస దేవరాజు ప్రత్యేక ఫేస్ మాస్క్ ను తయారు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరగటం అందరికి ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడపటంతో పాటు అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరచుకుంటున్న నేపద్యంలో ప్రజలు మరింత రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీనికి తోడు కరోనా విధుల్లో ఉంటున్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్స్, వార్డు వాలంటీర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో మాస్కుల పాత్ర కీలకమైనది.
దీనిని దృష్టిలో పెట్టుకొని శ్రీ కామాక్షి కేర్ ఎండీ తాడివలస దేవరాజు స్వయం ఆలోచనతో ప్రత్యేకంగా ఈ మాస్కులు తయారు చేశారు. ఇవి పూర్తి పారదర్శకంగా ఉండటంతో పాటు కళ్ళు, ముక్కు, నోరు, చెవులకు రక్షణ కలిపిస్తాయి. దీంతో బయట తిరిగే సమయంలో ఎవరైనా తుమ్మిన, దగ్గిన వాటి తుంపర్లు దరిచేరవు. ఇందులో మరో సౌలభ్యం ఉంది. వీటిని ఎప్పటికపుడు డేట్టాల్, శానిటైజరుతో శుభ్రం చేసుకుని తిరిగి ఉపయోగించవచ్చు. వీటిని పెద్ద మొత్తంలో తయారు చేసి ఆయా వర్గాలకు అందజేయాలనేది తన ఆలోచనగా చెప్పారు. ఈ మస్కుల తయారీలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది విజయ్, కుమార్, రాజశేఖర్రెడ్డి, నరేంద్ర, కాజా ఆనంద్ పాల్గొన్నారు.