Home బాపట్ల సహకార సంఘాలు అభివృద్ధిలోకి రావాలి : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

సహకార సంఘాలు అభివృద్ధిలోకి రావాలి : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

23
0

బాపట్ల (Bapatla) : సహకార సంఘాలు మరింత అభివృద్దిలోకి రావాలని కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌కుమార్‌ (Dr.VinodKumarIAS) అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవవారం జరిగిన జిల్లా సహకార సంఘాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. జిల్లాలో 1,121 సహకార సంఘాలు ఉన్నాయన్నారు. వీటి పరిధిలో నాలుగు పెట్రోల్ బంకులు, జనరిక్ మందుల దుకాణాలు పని చేస్తున్నాయని అన్నారు. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా సంఘాల కార్యకలాపాలు ఉండాలని అన్నారు. సహకార శాఖ పరిధిలో నిర్మిస్తున్న 35 గోదాముల పరిస్థితులపై ఆరా తీశారు. రైతులకు ప్రయోజనకరంగా గోదాములు ఉండాలని చెప్పారు. రైతులకు నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సమావేశంలో సహకార శాఖ జిల్లా అధికారి చిత్తూరి శ్యాంసన్, వ్యవసాయ శాఖ జెడి విజయనిర్మల, మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్ బాబు, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్, కేంద్ర సహకార బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.