Home బాపట్ల అమెరికా సామ్రాజ్యవాధం ఖండించండి

అమెరికా సామ్రాజ్యవాధం ఖండించండి

14
0

బాపట్ల (DN5 News) : అమెరికా సామ్రాజ్యవాధాన్ని ఖండించి యుద్ధాన్ని ఆపాలని సిపిఎం నాయకులు పి కొండయ్య కోరారు. యుద్ధం, మానవహననాన్ని ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో వెదుల్లపల్లిలో యుద్ధ వ్యతిరేక సభలో ఆయన మాట్లాడారు. ఇజ్రాయిల్ దుర్మార్గమైన దాడిలో 165 మంది పసిపిల్లలు మృతి చెందారని అన్నారు. 2వేలకు పైగా ప్రజల్ని బలి తీసుకుందని అన్నారు. అమెరికా సామ్రాజ్య వాద కాంక్ష కారణం అన్నారు. ఆయిల్ నిక్షేపాల కోసంమే అమెరికా యుద్దాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇంత జరుగుతున్నా భారత ప్రధాని నోరు విప్పకపోవడం దారుణమని అన్నారు. 200ఏళ్ళ బ్రిటిష్ సామ్రాజవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఘనమైన చరిత్ర మనకు ఉందని అన్నారు. కార్యక్రమంలో జెవివి నాయకులు కోటా వెంకటేశ్వరరెడ్డి, దినేష్ రెడ్డి, రమణయ్య, అక్కల వెంకటేశ్వర్లు, మచ్చా పోతురాజు, కోట బాబులురెడ్డి, నల్ల శ్రీనివాసరెడ్డి, కోట సుందర్రామిరెడ్డి పాల్గొన్నారు.