ఒంగోలు : గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్ల లబ్ధిదారుల రాయితీల ఫైలు తక్షణం తన వద్దకు తీసుకురావాలని కలెక్టర్ పోలా భాస్కర్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి చంద్రశేఖర్ ను ఆదివారం ఆదేశించారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో మూడు సార్లు తీర్మానించి నప్పటికీ సమస్యను పరిష్కరించకపోవడాన్ని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ అంశంపై డిఐపిసి సభ్యులు వి భక్తవత్సలం ఆదివారం కలెక్టర్ ను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. గత డిసెంబరు 7న జరిగిన సమావేశంలో వారంలోనే సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ కు జిఎం చెప్పారు. ఆరు నెలలు కావస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. కొంతమంది ఐపీఓ వాహనాలను వెరిఫై చేశారు. దస్త్రాల పరిశీలనలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ మంగళవారంలోపు తనకు ఫైలు సమర్పించాలని ఆదేశించారు.
Home ప్రకాశం ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్ల లబ్ధిదారులకు రాయితీల తక్షణ మంజూరుపై పరిశ్రమల శాఖ జిఎంకు కలెక్టర్ ఆదేశం