Home ప్రకాశం గ్రీన్ జోన్ లో పారిశ్రామికవేత్తలకు కలెక్టర్ పోలా భాస్కర్ సూచనలు

గ్రీన్ జోన్ లో పారిశ్రామికవేత్తలకు కలెక్టర్ పోలా భాస్కర్ సూచనలు

264
0

ఒంగోలు: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం గ్రీన్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్ డౌన్ నిబంధనలు వివరించేందుకు కలెక్టర్ పోలా భాస్కర్ పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. జీవో నెంబర్ 88 లో ఉన్న నిబంధనలు వివరించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణకు పారిశ్రామికవేత్తలు తమ వంతు బాధ్యతలను నిర్వహించారని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రాంతాలను విభజించి నట్లు తెలిపారు.