అద్దంకి (DN5 News) : మండలంలోని శింగరకొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 01 నుండి 2027 మార్చి 31వరకు అనగా ఒక సంవత్సరానికి దేవస్థానం వద్ద కొబ్బరికాయలు, పూజా ద్రవ్యంలు అమ్ముకొనుట, కొబ్బరి చిప్పలు పోగు చేసుకొను హక్కునకు బహిరంగ వేలం పాటలు గురువారం నిర్వహించారు. గత ఏడాది రూ.2.13లక్షలు వేలం పాడుకోగా ఈ ఏడాది రూ.2.50లక్షల ఆదాయం సమకూరిందని ఇఒ మద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కన్నా రూ.37వేల ఆదాయం పెరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో వేలం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మణికేశ్వరం గ్రూపు టెంపుల్ ఈఒ గుంటుపల్లి వాసు బాబు, పాలక మండలి చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, దేవస్థానం సిబ్బంది, పాటదారులు పాల్గొన్నారు.






