రేపల్లె (Repalle) : రాష్ట్రంలో పేద, మధ్య తరగతికి చెందిన వారెవరూ వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. (Minister Anagani Satyaprasad) పేదలకు ఆరోగ్య పరిరక్షణ, సీఎంఆర్ఎఫ్ (CMRF)నుంచి తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ సంక్షేమ పథకానికి అత్యంత ప్రాధాన్యాన్నిస్తూ చెక్కులు, ఎల్ఓసీల పంపిణీలో ఎటువంటి జాప్యంలే కుండా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. సిఎం ఆలోచన క్షేత్రస్థాయి ఆచరణలో సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికి 877 మందికి ఈపాటికే రూ.9,11,08743 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు పంపిణీ చేసినట్లు తెలిపారు.






