టంగుటూరు : వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎంఎల్ఎ డోలా శ్రీబాలవీరాంజనేయులు తూర్పునాయుడుపాలెంలోని తన కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు. సింగరాయకొండ పోతయ్య కాలనీకి చెందిన వయల శివకు రూ. 48వేలు, పొన్నలూరు మండలం చవటపాలెంకు చెందిన దొమ్మలపాటి నారాయణమ్మకు రూ.20వేలు, రాజోలుపాడుకు చెందిన గడిల పుష్పకు రూ. 16.5వేలు, జరుగుమల్లి మండలం రామచంద్రపురంకు చెందిన బొబ్బల మహేష్ బాబుకు రూ.1.74లక్షలు, కనమర్లపూడి ఓబయ్యకు రూ.1.20లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.