Home బాపట్ల 93మందికి సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

93మందికి సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

35
0

చీరాల (Chirala) : ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య (MLAKondaiah)సిఫార్సుతో మంజూరైన రూ.68.94లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఒసిలను లబ్దిదారులకు ఎంఎల్‌ఎ కొండయ్య మంగళవారం అందజేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 816 మందికి రూ.7.71కోట్లు సీఎం సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CMChandrababau)మంజూరు చేసినట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రూ.23 కోట్లతో నూతన క్రిటికల్ కేర్‌ యూనిట్ హాస్పిటల్ నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల మెరుగుకు రూ.14 కోట్లతో హెల్త్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మెరుగైన వైద్యం నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులు సిఎం సహాయనిధికి (CMRF) దరఖాస్తు చేసుకుంటే వైద్యం కోసం అయిన ఖర్చును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధనరావు, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, తెలుగుదేశం నాయకులు నాసిక వీరభద్రయ్య, చీరాల, వేటపాలెం, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.