భటప్రోలు (DN5 News) : మండలం కేంద్రమైన భట్టిప్రోలు చేనేత కుటుంబానికి చెందిన బండారు దేవి వరప్రసాద్ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయాన్ని శాసన సభ్యులు నక్కా ఆనందబాబు (MLA Nakka Anandababu) దృష్టికి తీసుకువెళ్లగా ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన దేవి వరప్రసాద్‌కు సిఎం సహాయ నిధి నుండి రూ.6 లక్షలు మంజూరు చేయించారు. టిడిపి బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బట్టు మల్లిఖార్జునరావు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి గొట్టుముక్కల లెనిన్, డిసి అధ్యక్షులు వై కరుణ శ్రీనివాసరావు, ఎస్‌సి సెల్ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి సుందరరావు కృషితో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సిఎం సహాయ నిదికి పంపించిన 24 గంటల్లో రూ.6లక్షల సహాయం అందించారు. బాధిత కుటుంబం తోపాటు పద్మశాలియ సంఘం ప్రతినిధులు ఎంఎల్‌ఎ ఆనందబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.






