కందుకూరు : ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు కందుకూరు మాజీ ఎంఎల్ఎ డాక్టర్ దివి శివరాం, కొండపి ఎంఎల్ఎ డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు వేరు వేరు ప్రాంతాల్లో శనివారం బాధితులకు అందజేశారు. గుడ్లూరు మండలం పరకొండపాడుకు చెందిన అత్యాల పేరమ్మ వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.2.50లక్షల విలువైన చెక్కును కందుకూరు మాజీ ఎంఎల్ఎ డాక్టర్ దివి శివరామ్ తన కార్యాలయంలో అందజేశారు.
పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెంకు చెందిన లింగాబత్తుని రామారావుకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.1.05లక్షల విలువైన చెక్కును కొండపి ఎంఎల్ఎ డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు తన కార్యాలయంలో శనివారం అందజేశారు. కార్యక్రమంలో కంటు గోపికృష్ణప్రసాద్, దాసరి కొండలరావు ఉన్నారు.