Home ప్రకాశం అశోక్ బాబును అభినందించిన సీఎం జగన్

అశోక్ బాబును అభినందించిన సీఎం జగన్

597
0

కొండపి(దమ్ము) : గడపగడపకు మన ప్రభుత్వంపై అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన వైఎస్ఆర్‌సిపి రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి మంత్రులు, ముఖ్య నేతలతో పాటు 175 నియోజకవర్గాల సమన్వయకర్తలతో సిఎం వైఎస్‌ జగన్ వర్క్ షాప్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్‌షాపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబును అభినందించినట్లు తెలిసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న విధంగా నిర్వహించిన వారిలో అశోక్‌బాబు పనితీరు బాగున్నట్లు ప్రశంసించారు. ఎన్ని రోజులైనా సచివాలయం (గ్రామం)లోని 100 శాతం ఇళ్లను పూర్తిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం మిస్ కాకూడదని సూచించినట్లు తెలిసింది. అశోక్ బాబుకు ఈ ఏడాది మే 11న ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న రోజునే తనకు ఇన్చార్జి బాధ్యతలు రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి, వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి టంగుటూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించారు. మొదటి రోజు నుండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అధికారులు, మండల, గ్రామ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాల కరపత్రాల రూపంలో అందించారు. ముఖ్యమంత్రి జగనన్న చెప్పిన విధంగా అన్ని పూర్తి చేస్తున్నాడని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. గ్రామాల్లోని అసంతృప్తి నేతలనుకూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరొకప్రక్క ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజలను, ప్రధానంగా మహిళలను భాగస్వామ్యులను చేస్తూ గడపగడపకు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు షుమారు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో 35వేల గడపలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు, కృషిని వివరించారు.