చిన్నగంజాం : పేదల సేవలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలం కొత్తగొల్లపాలెంలో పింఛన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ అందజేశారు. లబ్ధిదారుని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. లబ్ధిదారుని కుటుంబ జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని బాగా చదివించాలని సూచించారు. ఆయన వెంట శాసనసభ్యులు ఏలూరి సాంబాశివరావు, ఎంపి కృష్ణ ప్రసాద్, చీరాల, బాపట్ల ఎంఎల్ఎలు కొండయ్య, నరేంద్రవర్మ, కలెక్టర్ జెవి మురళి ఉన్నారు.