Home ప్రకాశం చీరాలలో వస్త్ర వ్యాపారుల ధర్నా… పోలీస్ స్టేషన్ పై దాడికొస్తారా అంటూ పోలీసుల బెదిరింపులు

చీరాలలో వస్త్ర వ్యాపారుల ధర్నా… పోలీస్ స్టేషన్ పై దాడికొస్తారా అంటూ పోలీసుల బెదిరింపులు

576
0

 

చీరాల : వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తున్న మాధురి అనే మహిళ ఏడేళ్ళక్రితం చీరాల ఏంజిసి మార్కెట్లోని అరవపల్లి లీలాకుమార్ వద్ద పెద్ద మొత్తంలో బట్టలు కొనుగోలు చేసింది. ఆ కొనుగోలుకు సంభందించిన నగదు చెల్లించకుండానే బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ బదిలీల్లో తిరిగి ఆ మహిళా ఉద్యోగి చీరాల వచ్చారు. బదిలీ ఆవిషయం తెలుసుకున్న వస్త్ర వ్యాపారి అరవపల్లి లీలాకుమార్ వాణిజ్య పన్నుల కార్యాలయానికి వెళ్లి తన బాకీ చెల్లించాలని అప్పు వసూలు చేసుకునే పద్ధతిలోనే వత్తిడి చేశారు. దీంతో తనను కులంపేరుతో దుషించారని మహిళా ఉద్యోగి ఒకటో పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహిళా ఉద్యోగి పిర్యాదు మేరకు పోలీసులు వస్త్ర వ్యాపారి అరవపల్లి లీలాకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తనకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వమని అడిగిన తనపై తప్పుడు కేసు పిర్యాదు చేస్తే తనను అరెస్ట్ చేయడం ఏమిటని వస్త్ర వ్యాపారి పోలీసులను ప్రశ్నించారు. బాధితుల ఫిర్యాదును నమోదు చేసుకోవడమే తమ పని అని పోలీసులు వస్త్ర వ్యాపారిపై కేసు నమోదు చేశారు. వస్త్ర వ్యాపారి లీలాకుమార్ను అదుపులోకి తీసుకున్నారు.

తోటి వ్యాపారిని తప్పుడు కేసులో అరెస్ట్ చేయడంపై ఆగ్రహించిన మార్కెట్లోని అన్నీ దుకాణాల వస్త్ర వ్యాపారులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాకీ వసూలు చేసుకునేందుకు వెళ్లిన వ్యాపారిపై తప్పుడు కేసు పెడితే విచారించకుండానే నమోదు చేసి ఎలా అరెస్టు చేస్తారని వ్యాపారులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో పిర్యాదు నమోదు చేసుకోవడం, విచారించి పిర్యాది దారునికి న్యాయం చేయడం తమపని అని, పోలీస్ స్టేషన్ వద్దనుండి వెల్లపోతే స్టేషన్ పైకి దాడికి వచ్చారని కేసులు నమోదు చేయాల్సి వసుందని హెచ్చరించారు. వ్యాపారులను చెదరగొట్టారు.

పోలీసుల తీరుపై వస్త్ర వ్యాపారుల విమర్శలు
పోలీసులు వస్త్ర వ్యాపారుల పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైనది. పిర్యాదు ఇచ్చి నెలలు, వారాలు గడిచిన ముద్దాయిలను అరెస్టు చేయడంలో జాప్యం వహించే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి క్షణాల్లో అరెస్టు చేయడం వెనుక ఉన్న కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వత్తిడి కారణంగానే పొలీసులు అలా వ్యవహరించారనే ఆరోపణలు చేస్తున్నారు.

వస్త్ర దుకాణాలు బంద్
తప్పుడు కేసులో వస్త్ర వ్యాపారిని అరెస్ట్ చేశారంటూ పోలీస్ వైఖరికి నిరసనగా వస్త్ర వ్యాపారులు బుధవారం పట్టణంలో వస్త్ర దుకణాలను బంద్ చేశారు. పోలీస్ అధికారులు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.