Home సినిమా ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ

ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ

319
0

‘జాన్’ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి ఉండొచ్చని ఆయన పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి తెలిపారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలకు
ఆమె బదులిచ్చారు. ప్రభాస్‌కు పెళ్లి చేయాలని తమకూ ఉందని చెప్పారు. తమది పెద్ద కుటుంబమని, అందరితోనూ సర్దుకుపోయే అమ్మాయి కావాలన్నారు. అందువల్లే ప్రభాస్ పెళ్లి ఆలస్యమవుతోందని, ‘జాన్’ సినిమా విడుదల తర్వాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని శ్యామలా దేవి చెప్పారు.

కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘జాన్’ మూవీలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ ఈ
మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.