Home బాపట్ల ఆర్ఓబి ప్రారంభంపై స్పష్టత ఇవ్వాలి

ఆర్ఓబి ప్రారంభంపై స్పష్టత ఇవ్వాలి

5
0

చీరాల (Chirala) : పట్టణంలో ఫైర్ స్టేషన్ వద్ద ఆర్ఓబి నిర్మాణంకు స్పష్టత ఇవ్వాలని శాసన సభ్యులు ఎంఎం కొండయ్య (MLA Kondaiah) అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తర సమయంలో ప్రశ్నించారు. గడిచిన పదేళ్లలో అప్పటి పాలకులు కష్టపడి సాధించుకున్న ఆర్ఓబిని టెండర్ ప్రక్రియ దశలో గుంటూరుకు తరలించారని అన్నారు. అయితే ప్రస్తుతం గతిశక్తి ద్వారా ఫ్లైఓవర్ మంజూరైందని చెబుతున్నారని, అయితే అది ఎప్పుడు ప్రారంబిస్తారో సభ ద్వారా చెప్పాలని మంత్రిని కోరారు. చీరాల అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ ఫైర్ స్టేషన్ గేటును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడంతో ద్విచక్ర వాహనదారులు, బాటసారులు అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. కావున ఫ్లైఓవర్ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కోరారు.