Home ప్రకాశం పారిశుద్య కార్మికుల వేతనాలు ఇవ్వాలి : సిఐటియు

పారిశుద్య కార్మికుల వేతనాలు ఇవ్వాలి : సిఐటియు

196
0

పామూరు : స్వచ్ఛభారత్ కార్మికులకు (క్లాప్ మిత్రులకు) గత పది నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన దీక్షలనుద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి కే మాల్యాద్రి మాట్లాడారు. వేతనాలు ఇప్పటికైనా ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండలంలో కార్మికులకు 7నెలల నుండి 23 నెలలు కావస్తున్న నేటికీ స్వచ్ఛభారత్ కార్మికులకు వేతనాలు అందలేదని అన్నారు. కార్మికుల కుటుంబాలు అప్పులు చేసి ఆస్తులను కుదువ పెట్టుకొని, అప్పులు పుట్టక దుర్భర జీవనం గడుపుతున్నారని అననారు. వేతనాలు ఇవ్వకపోతే కార్మికులు ఎలా బ్రతకాలని అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

10నెలల వేతనాలు పెండింగ్‌ ఉంటే రెండు నెలల జీతం వేస్తామని మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. 15వ ఆర్థిక నిధులు పంచాయతీకి ఎంత వచ్చిందో వాటిలో కార్మికుల జీతాలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా జీతాలు చెల్లించాలని కోరారు. కనీస వేతనం రూ.18వేలు అమలు చేయాలని కోరారు. హెల్త్ అలవెన్స్ రూ.6వేలు చెల్లించాలని అన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాదా బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. రక్షణ పరికరాలు, బ్లౌజులు, మాస్కులు, యూనిఫారాలు, కాస్పోర్టిక్స్ అందజేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త దీక్షలో భాగంగా పామూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద సిఐటియు సీనియర్ నాయకులు షేక్ అల్లాబక్షు పూల దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. దీక్షలలో వివిధ గ్రామాల నుండి పారిశుద్య కార్మికులు కాశయ్య, మోషే, అంకయ్య, బాల చెన్నయ్య, సాంసన్, మహాదేవయ్య, గురవయ్య, అంకయ్య పాల్గొన్నారు.