సంగారెడ్డి : సంగారెడ్డి ఖాజీపల్లి పారిశ్రామికవాడలోని టిఐడిసి పరిశ్రమలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు నేత చుక్కా రాములు ఘన విజయం సాధించారు.
దుబ్బాక ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంతో ఉన్న బిజెపి ఎమ్యెల్యే రఘునందన్ రావుకు కార్మికులు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ టీఐడీసీ కార్మిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కంపెనీలో శనివారం యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై 4ఓట్లతో గెలుపొందారు. కంపెనీలో మొత్తం 184 ఓట్లు పోలవగా, సీఐటీయుకు 94ఓట్లు, బీఎంఎస్‌కు 90 ఓట్లు వచ్చా యి. సీఐటీయు గెలుపుతో పరిశ్రమ ఎదుట కార్మికులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగేలా కృషి చేస్తామన్నారు.