చీరాల (Chirala) : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన విజయవాడ దత్తోపంత్ ఠేంగడి జాతీయ కార్మిక విద్యా, అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలలో (Sri Gouthami Degree College) కెరీర్ గైడెన్స్ అండ్ జాబ్ మార్కెట్ ఓరియంటేషన్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను స్పష్టంగా నిర్ధేశించుకుని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. డీటీఎన్‌బీడబ్ల్యూఈడి విజయవాడ రీజనల్ డైరెక్టర్ బి వెంకటరావు అధ్యక్షత వహించారు. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ముంబై డిప్యూటీ సీఈఒ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో అవగాహన పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్, ఎల్‌ఐసి డిఒ ఎ రామారావు, ఎన్ అశోక్ చక్రవర్తి, డీటీఎన్‌బీడబ్ల్యూఈడి ఫెసిలిటేటర్ ఎస్‌డి మతీన్ పాల్గొన్నారు.






