Home సినిమా చిరు, కొరటాల సినిమాకు భారీ బడ్జెట్… ఎంతో తెలిస్తే..

చిరు, కొరటాల సినిమాకు భారీ బడ్జెట్… ఎంతో తెలిస్తే..

376
0

చిరంజీవి మరో మెగా ప్రాజెక్ట్‌తో సందడి చేయనున్నారు. సోషల్ డ్రామాగా రాబోతున్న సదరు సినిమా కోసం భారీ మొత్తాన్నే వెచ్చిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి అంటేనే భారీ చిత్రాలకు చిరునామా. ఇక తన కలల ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ అయితే కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో గ్రాండియర్ విజువల్స్ కోసం ఆ స్థాయిలో ఖర్చు పెట్టకతప్పలేదు. ఒకవైపు ఈ సినిమా థియేటర్లలో నడుస్తుండగనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు చిరు. అంతేకాదు ‘సైరా’ స్థాయిలో కాకున్నా ఆ తరువాతి స్థానంలో నిలచేలా ఈ సినిమాకి ఖర్చు పెడుతున్నారట. సోషల్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం కోసం దాదాపు 140 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నారని టాక్.

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసమే 140
కోట్ల రూపాయిలు వెచ్చిస్తున్నారట. ఈ చిత్రం కోసం చిరు 50 కోట్ల పారితోషికం తీసుకుంటుండగా, కొరటాల 20 కోట్ల మొత్తాన్ని అందుకుంటున్నారని వినికిడి. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ మరో 10 కోట్లు ఉంటుందని టాక్. అంటే ఓవరాల్‌గా పారితోషికమే 80 కోట్లు పలుకుతుందన్నమాట. ఇక నిర్మాణ వ్యయాలు 60 కోట్ల వరకు ఉంటాయని అంటున్నారు. మరి చిరు కెరీర్‌లో సెకండ్ హయ్యస్ట్ బడ్జెట్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా బాక్సాఫీస్ ముంగిట ఏ స్థాయి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.