Home ప్రకాశం చిరంజీవి జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

చిరంజీవి జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

261
0

చీరాల : మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. విట్టల్ నగర్ వృద్ద ఆశ్రమం నందు వృద్ధులకు రొట్టెలు, పళ్ళు చిరంజీవి యువత, జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ చిరంజీవి 65వ పుట్టినరోజు ఘనంగా చేయాలని నిర్ణయించామని, కానీ లాక్ డౌన్ నియమ నిబంధనల వలన చేయలేకపోయామని పేర్కొన్నారు. వాటిలో భాగంగా పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి చూపిన బాటలోనే పయనిస్తమని, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన ఆయన జీవితం అందరికీ ఆదర్శం అని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గూడూరు శివరామప్రసాద్, ఆనుమకొండ కిషోర్, ఎరిచర్ల అశోక్ కుమార్, శ్రీనివాసరావు, చిరంజీవి యువత, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.