చీరాల : 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి యడం బాలాజీని గెలిపించాలని వైసిపి బాపట్ల పార్లమెంటు ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నియోజకవర్గ పరిశీలకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కార్యకర్తలను కోరారు. చీరాల బాలాజీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశానికి వైసిపి పట్టణ అధ్యక్షులు జైసన్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో యడం బాలాజీనే గెలిపించాలని ప్రకటించారు.
పార్టీలోకి ఎవ్వరో వస్తారని ఆపోహలు వద్దన్నారు. ఎవ్వరినీ తీసుకునేదిలేదని, బాలాజీనే పోటీ చేస్తారని ప్రకటించారు. కార్యకర్తలు అందరూ ఐక్యంగా పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో నాయకుల మద్య ఉన్న చిన్న చిన్న విభేదాలు వదిలి రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.
2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడరని తెలిపారు. మన అనే వారి కన్నా పరాయి వాడిని పిలిస్తే మనకు, మన పార్టీకి ప్రయోజనమేమిటన్నారు. ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా జగన్‌కే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో వచ్చే సమస్యలను క్షుణ్ణంగా పరిసిలుస్తున్నామన్నారు. చీరాలలో ప్రతి ఒక్క జగన్ అభిమాని బాలాజీకి ఓట్ వేసి గెలిపించాలని కోరారు. సభలో వాడరేవు నుండి 30 మంది కార్యకర్తలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసిపి అద్దంకి సమన్వయకర్త బాచిన చెంచుగరటయ్య, బాపట్ల పార్లిమెంట్ ఇంచార్జి నందిగం సురేష్, రాష్ట్ర కార్యదర్శి అమృతపాణి, కొండ్రు బాబ్జి, అధికార ప్రతినిధి యడం రవిశంకర్, ఎస్‌సిసెల్ రాష్ట్ర కార్యదర్శి సలగల అమృతరావు, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కొరబండి సురేష్, కౌన్సిలర్ పొదిలి ఐస్వామి, కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు, డేటా దివాకర్, యతం ఆనందరావు పాల్గొన్నారు.