Home బాపట్ల వృద్దాశ్రమంలోని వృద్దులకు కాస్మోటి క్స్ పంపిణి

వృద్దాశ్రమంలోని వృద్దులకు కాస్మోటి క్స్ పంపిణి

140
0

చీరాల : ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రంధి నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆర్ధిక సహకారంతో నవాబ్ పేటలోని పాండురంగ వృద్ధాశ్రమంలోని వృద్దులకు సబ్బులు, పేస్ట్ లు, బ్రష్ లు, కొబ్బరినూనె డబ్బలు, దువ్వెనలు, షాంపూ ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు మొత్తం 9 రకాల నిత్యావసరాలను పంపిణీ చేశారు.

ఆవోపా అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ ఈనెల 8న నిర్వహించే ఉచిత అందజేస్తున్న కృత్తిమ పాదాలకు ఒక పాదంనకు రూ.5,116, శ్రీకృష్ణ గోశాల వారికి గోవుల ఆహార నిమిత్తం రూ.1500 అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురు ప్రసాద్, నారాయణమూర్తి, వలివేటి మురళీకృష్ణ, సత్యనారాయణ, బ్రహ్మానందం, రమేష్, సురేష్, వీరాంజనేయులు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, తుకారాం, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.