చీరాల : వాడరేవు సముద్ర తీరంలోని ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సాగర తీరాన జేష్ట పౌర్ణమి సాగర హారతి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక నియోజకవర్గ ప్రమఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు, బండారు జ్వాల నరసింహం, అర్చక స్వాములు, వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, విట వెంకటేష్, కార్తీక్ శర్మ, సుధాకర్ ఆధ్వర్యంలో స్పటిక శివలింగానికి పంచ అమృతలతో అభిషేకం, మంత్ర పుష్పం, సామూహిక సాగర హారతి నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు బిజెపి అధ్యక్షులు బంగారు బాబు, కొండారెడ్డి, అనిల్ చేతుల మీదుగా అభిషేకం, సాగర హారతి నిర్వహించారు.
ఈ సందర్భంగాబాబు మాట్లాడుతూ టెంపుల్ టూరిజం బాగా అభివృద్ధి సాధిస్తుందని, సాగర హారతి మొదలుపెట్టిన తర్వాత ఓడరేవు హైవే పనులు కూడా వేగవంతంగా జరుగు తున్నాయని, హిందూ చైతన్య వేదిక నాయకులను బాగా చేస్తున్నందుకు ప్రశంసించారు. సముద్రం నుండి ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, సముద్రం అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుతూ సముద్ర హారతి ఇవ్వటం మంచిదని అన్నారు.
సాగర హారతి నిర్వాహకులు డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ శివానుగ్రహంతో ఎంతో విజయవంతంగా ప్రతి పౌర్ణమికి సాగర్ హారతి ఎంతో వైభవంగా జరుగుతుందని అన్నారు. త్వరలో మరకత శివ లింగంతో అభిషేకాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. హిందూ సంఘాలకు, చీరాల శాసన సభ్యులు కొండయ్యకు, పోలీస్ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ కృష్ణ, మనోహర్ రెడ్డి, మణి కుమార్, భవనీ, సుధ, మున్నం శ్రీనివాస్ రెడ్డి, దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వరరెడ్డి, పీక్కి రాంబాబు, కోటి శ్రీను, జంపాలా చిట్టి బాబు, సున్నం శ్రీనివాస్, సతీష్ వులిచి, మూర్తి జొన్న, పిక్కి నారాయణ, గోలి సాంబశివరావు, బుర్ల సాంబశివరావు, తడవర్తి చంద్ర, రాజేష్, డాక్టర్ సభరి, గుమ్మ బాలాజీ, హిందూ చైతన్య వేదిక సభ్యులు, భజన బృందం సభ్యులు, ఓడరేవు టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.