చీరాల : ఎస్సి వర్గీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోడించిన సందర్బంగా టిడిపి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ వంటి నియామకాల్లో వర్గీకరణ అమలు చేయడం ద్వారా అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం వస్తుందని తెలిపారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వం నుండి రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా పార్లమెంట్లో ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీకి, చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో తెలుగుదేశం ఎస్సీ విభాగం నాయకులు, వేటపాలెం మాజీ సర్పంచ్ మున్నంగి అరుణ్ కుమార్, తెలుగు యువత నాయకులు ఉసురుపాటి సురేష్, టిడిపి సీనియర్ నాయకులు గుమ్మడి ఏసురత్నం, దుడ్డు సైమన్, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, బిజెపి నాయకులు రత్నం తదితరులు పాల్గొన్నారు.