Home ప్రకాశం చీరాల టిడిపి సీటు కోసం… మంగళగిరి చే”నేత” శ్రీనివాసరావు దృష్టి

చీరాల టిడిపి సీటు కోసం… మంగళగిరి చే”నేత” శ్రీనివాసరావు దృష్టి

195
0

చీరాల : టిడిపి (Telugu Desham) సీటు కోసం పోటీ పెరుగుతుంది. ప్రస్తుతం టిడిపి (TDP) ఇన్‌ఛార్జిగా ఎంఎం కొండయ్య (MM KONDAIAH) కొనసాగుతున్నారు. అయితే ఆయనను మార్చనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపద్యంలో స్థానిక టిడిపి నేతలతోపాటు చీరాల ప్రాంతం నుండి వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆర్ధికంగా స్థిరపడిన నేతలు చీరాలపై ఆసక్తి పెంచుకున్నారు. వ్యాపార రంగంలో వచ్చిన పరిచయాలతో టిడిపి అధినేత చంద్రబాబు (CHANDRABABU), లోకేష్‌ (LOKESH)లతో నేరుగా పరిచయాలు కలిగిన చీరాల మండలం ఈపూరుపాలెంలో వారసత్వం కలిగిన తిరివీధుల శ్రీనివాసరావు చీరాల టిడిపి సీటు ఆశిస్తున్నట్లు తెలిపారు.

చేనేతలకు పట్టున్న దృష్ట్యా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి టిక్కెట్ కేటాయించే యోచనలో టిడిపి అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలో మంగళగిరిలో వ్యాపార దిగ్గజంగా గుర్తింపు పొందిన తిరువీధుల శ్రీనివాసరావు పేరు పరిశీలనలో ఉన్నట్లు చెప్పుకున్నారు. ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయని, లోకేష్‌కు కూడా ఆయన సన్నిహితుడని ఆ వర్గాలు చెబుతున్నాయి.

మంగళగిరిలో లోకేష్ పోటీకి దిగుతున్నందున అక్కడ తమకు అవకాశం పోయిందని చేనేతలు భావించకుండా ప్రత్యమ్నాయంగా చీరాలలో చేనేత సామాజిక వర్గానికి టిక్కెట్టు ఇవ్వాలన్నది టిడిపి వ్యూహంగా విశ్లేషిస్తున్నారు. దీంతో టిడిపి పలువురు అభ్యర్థులను పరిశీలిస్తొంది. టిడిపి పరిశీలనలో తిరువీధుల శ్రీనివాసరావు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఉన్నత విద్యావంతుడు, అంగ, ఆర్థిక బలం కలవాడు కావడంతో పాటు పార్టీకి కూడా విధేయుడైనందున శ్రీనివాసరావును చీరాల్లో పోటీకి నిలపాలని టిడిపి అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. 2019లో మంగళగిరిలో లోకేష్ పోటీ చేసినప్పుడు తిరువీధుల శ్రీనివాసరావు ఆయనకు బాసటగా నిలవడంతో పాటు ప్రచార కార్యక్రమాల్లో కూడా కీలక భూమిక పోషించిన అనుబంధం అధినేతలతో ఉన్నట్లు చెబుతున్నారు.

తిరువీధుల శ్రీనివాసరావు చీరాలకు కొత్త కాదని చెబుతున్నారు. ఆయనకు చీరాల నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయాలతోపాటు బంధుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన పట్ల చేనేతలు సానుకూలత వ్యక్తం చేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది టిడిపి విజయావకాశాలను పెంచుతుందని టిడిపి అధినేతలు అంచనా వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈపాటికే శ్రీనివాసరావు అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఆది నుండి టిడిపిలో ఉన్న చీరాల సీనియర్ టిడిపి నేతలు కూడా శ్రీనివాసరావును స్వాగతిస్తున్నట్లు భావిస్తున్నారు.