చీరాల : జగనన్న చేదోడు పధకంలో భాగంగా వృత్తి చేసే రజకు లందరికి రూ.10వేలు ఆర్దిక సహాయం చేయాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధార్నా నిర్వహించారు. ధర్నా అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేతి వృత్తి దారుల సంఘం జిల్లా కన్వీనర్ పి కొండయ్య, జి బ్రహ్మయ్య, కొల్లిపర వెంకటేష్, పి కిరణ్, నారాయణ, తులసీ, సిఐటియు నాయకులు యన్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.