దేశభక్తికి ప్రతిరూపం సుభాష్‌చంద్రబోస్‌ : తాడివలస దేవరాజు

    416
    0

    చీరాల : సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా పేరలలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

    తాడివలస దేవరాజు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య ఉధ్యమంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రపంచ చరిత్రలో వర్ధంతి లేని చిరంజీవిగా ప్రజల హృదయాల్లో చెరగని ప్రతిరూపం బోస్ అని పేర్కొన్నారు. ఒకవైపు గాంధీజీ, మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, ఆచరణలో పెట్టిన సమరయోధులని పేర్కొన్నారు. రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు సుభాస్‌చంద్రబోస్‌ అధ్యక్షుడయ్యారని, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించరని చెప్పారు.

    యంజి రెడ్డి మాట్లాడుతూ దాదాపు 11సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డరని పేర్కొన్నారు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచారన్నారు. కార్యక్రమంలో మోపిదేవి శ్రీను, పులి శివ, నాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.