చీరాల : మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం బుధవారం కౌన్సిల్ హాల్లో చైర్మన్ మొదడుగు రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలో ఇటీవల మృతి చెందిన 32వ వార్డ్ కౌన్సెల్లర్ పొదిలి ఐస్వామికి సంతాపం తెలిపారు. అనంతరం అజెండాలోని అంశంలపై చర్చ ప్రారంభించారు. అదే సమయంలో చైర్మన్ రమేష్ అల్ పాస్ అనడంతో 20వ వార్డ్ కౌన్సెల్లర్ కల్లగుంట్ల అంజమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. అజెండాలోని 23వ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టు పట్టారు. దీంతో చైర్మన్ రమేష్ సమాదానం చెప్పకుండా కౌన్సిల్ హల్ నుండి వెళ్లిపోయారు. ఛైర్మన్ వెళ్లిపోవడానికి నిరసనగా టీడీపీ కౌన్సెల్లర్లు చైర్మన్ పోడియం వద్ద ధర్నా నిర్వహించారు. 23వ అంశంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు ఏ విదంగా ఖర్చు చేసారో చెప్పకుండా అల్ పాస్ అనడంలో అర్థం ఏంటని టిడిపి కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ నామ కనకరవుకు డీసెంట్ అందచేశారు.