చీరాల : ఆర్కె గ్రీన్ వ్యాలీ 5డి విశాఖపట్నం రేడివి గ్రామం నందు వెంచర్‌ను చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య, ఆర్కే టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరీ అమర్నాథ్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎంఎల్‌ఎ కొండయ్య పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సైతం అందుబాటులో ఈ వెంచర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్కే గ్రీన్ వ్యాలీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.