చీరాల (Chirala) : నియోజకవర్గ ప్రజలు తనపై చూపిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనని శాసన సభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. తాను ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తనతోపాటు తన తనయుడు గౌరీ అమర్నాధ్ పుట్టినరోజు వేడుకలు టిడిపి నియోజకవర్గ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పర్చూరు, బాపట్ల శాసన సభ్యులు ఏలూరు సాంబశివరావు, వేగేశన నరేంద్ర వర్మ హాజరై తమ సహచరుడైన ఎమ్మెల్యే కొండయ్యతో పుట్టినరోజు కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కొండయ్య, ఆయన తనయుడు గౌరీ అమర్నాథ్ ఇద్దరు ఒకే రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం అరుదైన విషయమని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం శాలువాతో సత్కరించారు. కార్యకర్తలు, పూలతో కొండయ్యను ఆహ్వానించారు. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సలగల రాజశేఖర్, కౌన్సిలర్ సురగాని లక్ష్మీ, నరసింహారావు దంపతులు, టిడిపి నాయకులు సిద్ధి బుచ్చేశ్వరావు, ఎఎంసి ఛైర్మన్ కౌతరపు జనార్ధనరావు హాజరై పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హాజరైన కార్యకర్తలు, అభిమానులకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు స్కూటీలు ఎమ్మెల్యేలు కొండయ్య, వేగేశన నరేంద్రవర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు.