చీరాల : తన మౌనాన్ని బలహీనతగా చూడొద్దని శాసన సభ్యులు ఎంఎం కొండయ్య తన ప్రత్యర్ధులను హెచ్చరించారు. స్థాని ప్రగడ కోటయ్య విగ్రహం వద్ద టిడిపి జెండా ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను తొలిసారి చీరాల వచ్చిన రోజు అదే సెంటర్లో అప్పట్లో అధికారంలో ఉన్న వాళ్లు తన ప్లీక్సీలు పెట్టనివ్వకుండా తనను కనీసం మాట్లాడనీయకుండా అడ్డుపడ్డ వాళ్లు ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని అన్నారు. కాలం మారిందని, అనవసరమైన రాద్దాతం చేసేవాళ్లెవ్వరైనా తన మైనాన్ని బలహీనతగా చూడొద్దని సున్నితంగా హెచ్చరించారు.
నియోజకవర్గంలో తనను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారని, నియోజకవర్గ అభివృద్దికి ప్రజల సంక్షేమానికి తాను కట్టుబడి పనిచేస్తారనని చెప్పారు. ఎవ్వరైనా తన వద్దకు రావచ్చని, ప్రభుత్వ ఫలాలు అందించడంలో అర్హతే ప్రామాణికం తప్ప తనకు రాజకీయ కక్షలు చూడటం తెలియదని అన్నారు. సామరస్యంగా అభివృద్దికి కలిసి రావాలని కోరారు. ఎన్‌టిఆర్, ప్రగడ కోటయ్య విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని వివిధ వార్డుల్లో టిడిపి జెండాలు ఆవిష్కరించారు.
ఆయా వార్డులో ఏర్పాటు చేసిన అల్పాహారం వడ్డించారు. ఆయన వెంట టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కౌతవరపు జనార్ధనరావు, కొమ్మనబోయిన రజిని, గుంటూరు మాధవరావు, గుమ్మడి ఏసురత్నం, కౌన్సిలర్లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.