అమరావతి : శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మంగళవారం ప్రవేశపెట్టారు. సమయపాలన అద్భుతంగా పాటించారని చీరాల శాసన సభ్యులు ఎంఎం కొండయ్యను డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించారు. సభలో కొండయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ పథకాన్ని అమలు చేశామని అన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క కాలవలో కూడా పూడిక తీయలేదని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాలవలు, రోడ్ల పనులు చేశామని అన్నారు. గత ప్రభుత్వంలో దాన్యం అమ్మితే డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టిన అప్పులు కూడా కూటమి ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.