Home ప్రకాశం చీరాల కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కరణం బలరాం

చీరాల కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కరణం బలరాం

312
0

– చీరాల పరిస్థితులపై కలెక్టరేట్లో సమీక్ష
– చీరాలలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి
– ప్రజలకు మనోధైర్యం కలిగించాలి
– విదేశాలు, ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారందరిని క్వారంటైనుకు తరలించి వైద్య పరీక్షలు చేయించాలి.
– రోజువారీ కూలీలు, పేదలకు ఆహారం అందించాలి.
ఒంగోలు : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులపై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ శిద్దార్థ కౌశల్, డిపీఓ నారాయణరెడ్డి, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుండి వచ్చిన వారితోపాటు చీరాలలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సౌకర్యాలు పెంచాలని అధికారులను కోరారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చీరాలలో రోజు రోజుకు పెరుగుతున్నందున వారి నుండి ఇతరులకు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేయాల్సి అవసరం ఉందని మంత్రిని కోరారు. నియోజకవర్గ పరిధిలోని అనుమానితులు అందరికీ వైద్య పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై ఉన్నందువల్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను నివృత్తి కలిగించి మనోధైర్యం కల్పించాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి పట్టణంలోకి వచ్చిన వారిని గుర్తించి వారందరినీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని చెప్పారు.

గత పది రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున రోజువారీ కూలీలు, పేదలకు నిత్యావసరాల ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అవసరమైతే పేదలకు ఆహార పొట్లాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుండి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే వ్యాధి విస్తరణను నివారించగలం అని సూచించారు. ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని, సామాజిక దూరం తపకుండా పాటించాలని, నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చీరాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బలరాం తెలిపారు. ప్రజలు ఆపోహలు నమ్మవద్దని, పోలీసు వారికి సహకారాన్ని అందించాలని, నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజు వారీ కూలీలకు, పేదలకు, బిచ్చగాళ్లకు ఆహారం అందించాలని కోరారు.