Home ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ప్రణాళిక రూపొందించండి : మంత్రి కొట్టు సత్యనారాయణ

అభివృద్దికి ప్రణాళిక రూపొందించండి : మంత్రి కొట్టు సత్యనారాయణ

281
0

చీరాల : నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సమావేశ హలులో నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తే ప్రభత్వానికి పంపడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో కాలువ చివరి భూములకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సిఎం హామీ మేరకు చీరాల కుందేరు డ్రైన్ పనులకు త్వరలో శంఖుస్థాపన చేస్తామని చెప్పారు. మండలంలోని తోటవారిపాలెం, గవినివారిపాలెం ఎత్తిపోతల పధకాల మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. బోయినవారిపాలెం సాగునీటి కాలువల పూడికతీత పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

చీరాలలో ఆర్ఓబి నిర్మాణం కోసం కేంద్ర ప్రభత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆర్‌అండ్‌బి అధికారులకు సూచించారు. ఆర్‌అండ్‌బి రోడ్లు మరమ్మతులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని అంతర్గత రోడ్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారులకు అవసరమైన పడవల ఇంజన్లు, వలలు, ఐస్ బాక్స్ లు డిఆర్‌డిఏ ద్వారా మంజూరు చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఇంకా1720మంది లబ్ధిదారులు ఇంటి స్థలాలు కావలసిందిగా దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి అవసరమైన భూములు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బాపట్ల కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణ మూర్తి, వైసిపి ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, డిఆర్‌ఒ లక్ష్మీశివజ్యోతి, సిపిఓ భరత్ కుమార్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్, డిఎంహ్ఓ డాక్టర్‌ విజయమ్మ, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్ సత్తార్, పశుసంవర్ధక శాఖ జెడి హనుమంతరావు, మత్స్య శాఖ జెడి సురేష్, పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీలక్ష్మీ, డిఎస్ఓ విలియమ్స్, డిఇఓ రామారావు, డిసిఓ రామారావు, చీరాల ఆర్‌డిఒ సరోజిని, తహశీల్దారు ప్రభాకరరావు పాల్గొన్నారు.