చీరాల : కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న మెండు నిషాంత్ ఆపార్టీకి తన అనుచరులతో సహా రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఆతర్వాత ఐదేళ్లు పార్టీ కార్యక్రమాలు నిర్వహించి పార్టీని కాపాడుకున్న తమను కాదని వేరొకరికి పార్టీ సీటు ఇవ్వడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతోపాటు మరో 70మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. ఈసందర్భంగా అనుచరులతో చీరాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించి మూకుమ్మడిగా రాజీనామా లేఖలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో గజవల్లి శ్రీను, కరిముల్లా పాల్గొన్నారు.