Home ప్రకాశం జనతా కర్ఫ్యూలో అత్యవసర వైద్య సేవలు అందించిన శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య బృందం

జనతా కర్ఫ్యూలో అత్యవసర వైద్య సేవలు అందించిన శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య బృందం

292
0

– మేమందరం మీ ఆరోగ్యం కోసం మా కుటుంబాన్ని గూర్చి ఆలోచించకుండా వైద్యశాల విధుల్లో అందుబాటులో ఉన్నాము
– మీరందరూ దయచేసి ఇంట్లోనే ఉండండని ప్లే కార్డుల ప్రదర్శన
– వైద్య బృందానికి ,సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన తాడివలస దేవరాజు
– కరొన వ్యాధికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లో చికిత్స
చీరాల : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ చీరాలలో ప్రజల సహకారంతో బాగా జరిగిందని, ప్రతి ఒక్కరికీ అవగాహన వచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రజలలో కరోనాపై అవగాహన పెంపొందించేందుకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా కృషి చేసిందని కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూ ఈరోజు ఎంతో విజయవంతమైందని అన్నారు.

శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ముద్దన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చీరాలలో అత్యవసర వైద్య సేవలను అందించారు. ల్యాబ్, ఫార్మసీ, సిస్టర్స్ అందరు అందుబాటులో ఉండి తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో మేమందరం మీ ఆరోగ్యం కోసం మా కుటుంబాన్ని గూర్చి ఆలోచించకుండా హాస్పటల్లలో డ్యూటీలలో అందుబాటులో ఉన్నాము. మీరందరూ దయచేసి ఇంట్లోనే ఉండండి అని ప్లే కార్డులు ప్రదర్శించారు.

డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జలుబు, దగ్గు, తలనోపి, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు మీకు కానీ, మీ బంధువులకు, మిత్రులకు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని తెలియజేశారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, బయట తిరిగేటప్పుడు మాస్క్ ధరించడం కరోన నిర్మూలించడానికి ప్రాథమిక సూత్రాలని తెలిపారు.

కార్యక్రమంలో నాగేశ్వరరావు, నరేష్, విజయ్, నరేంద్ర, కొండారెడ్డి, శ్రీకాంత్, హరి, అజయ్, ఆనంద్, సాయి, అంజలి, అరుణ, సృజన, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.