Home ప్రకాశం చీరాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి : రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం

చీరాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి : రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం

457
0

చీరాల : రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటులో చీరాల కేంద్రంగా స్వాతంత్ర్య సమర యోధులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ య్య పేరుతో జిల్లా ఏరాటు చేయాలని జేఏసీ ప్రతినిధులు తీర్మానించారు. ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆదివారం చీరాల గోలి సదాశివరావు కళ్యాణమండపంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు.

 

సీపీఐ ఏరియా కార్యదర్శి మేడ వెంకటరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ చీరాలలో వాన్ పిక్ భూమి చాలా ఉంది అని అన్నారు. అన్ని విధాలుగా చీరాల ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాడానికి సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. చీరాల జిల్లా కావడానికి విద్యార్థుల ఉద్యమంలోకి రావాలని కోరారు. ప్రత్యేక జిల్లా కోసం పట్టణంలో భారీ ప్రదర్శన చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. రిలే దీక్షలు కూడా చేయాలని తీర్మానం చేసారు. అదే విదంగా పోస్ట్ కార్డు ఉద్యమం, సీఎస్-సీఎంలకు మెసేజ్ లను కూడా పెట్టేవిధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరారు.

కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజ్, వైసీపీ నాయకులు బీరక సురేంద్ర, జేఏసీ సభ్యులు ఉటూకూరి వేంకటేశ్వర్లు, జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ ఠాగూర్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పొలవరపు వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.