ఒంగోలు : వేటపాలెం మండలం నయనపల్లిలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి బైపాస్ ప్రక్కన హ్యాండ్లూమ్ పార్క్ కు 50ఎకరాల భూమి కేటాయించారు. రాజీవ్ గృహకల్ప, చేనేతపురికి వంటి అవసరాలకు కేటాయించిన భూమి పోను మిగిలి ఉన్న 26.81ఎకరాల భూమిలో చేనేత పార్క్, చేనేతలకు ఉపాధి అవకాశాలు పెంచే అభివృద్ధి పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చేనేత ప్రతినిధులు శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తిని కోరారు. ఎమ్మెల్యే బలరామ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రావు, జాయింట్ కలెక్టర్, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ కు వినతి పత్రం అందజేశారు. మంత్రులను కలిసిన వారిలో ప్రముఖ చేనేత నాయకులు, మాజీ ఏఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఆప్కో చైర్మన్ దామర్ల శ్రీకృష్ణ మూర్తి, చేనేత నాయకులు బండారు జ్వాలా నరసింహ, మేడా వెంకట్రావు, గోలి ఆనందరావు, అండగుండ నారాయణ, దివి జయరాం, చేనేత నాయకులు, కార్మికులు ఉన్నారు.