చీరాల : ప్రపంచ తెలుగు వారి సాంస్కృతిక ప్రతీక పద్మశ్రీ ఘంటసాల అని ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక ఘంటసాల విగ్రహం సెంటర్‌ను రాష్ట్రస్థాయి సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు కోరారు. ఘంటసాల 51వ వర్ధంతి మాసో త్సవాల సందర్భంగా ఘంటసాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో చీరాలలోని ఘంటసాల విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ ఘంటసాల గానామృతం నేటి, రేపటి తరాలకు అందించుదామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అందె నరసింహారావు, బక్క జయరామిరెడ్డి, నంగు రాజశేఖర్, బి చిన్నబాబు, రాజు, గుర్రెముచ్చు సుధీర్, మల్లెల రత్నరాజు, డేటా ప్రకాష్ పాల్గొన్నారు.